
నేడు నాగలాపురంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశము
నాగలాపురం: మండలంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశము ఉదయం 10.30 గంటలకు నిర్వహించబడుతుందని ఎంపిడిఓ వెంకటరత్నమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి, జెడ్పిటిసిలు, వైస్ఎంపిపి, ఎంపిటిసి సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మండల రైతు సంఘ అధ్యక్షులు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, పంచాయతి కార్యదర్శులు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె కోరారు.

