
*కొత్త ఇండ్ల లో ఘనంగా శ్రీ సల్లపురెమ్మ గంగజాతర.
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఫిబ్రవరి20
బైరెడ్డిపల్లి మండలం.
కొత్త ఇండ్లు గ్రామంలో
శ్రీ సల్లపురెమ్మ గంగమ్మ జాతర బుధవారం రాత్రి ప్రారంభం అయినది. ఈ సందర్భంగా అమ్మవారి శిరస్సు మెరవణి గ్రామపురవీధుల్లో భక్తుల కోలాహలం,సాంస్కృతి కార్యక్రమాలు,బాణాసంచా వేడుకలు తో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి శిరస్సు మెరవణి గురువారం తెల్లవారుజామున ముగియగా గ్రామ నడిబొడ్డున అమ్మవారిని ప్రతిష్టించారు. గురువారం మండలం లోని వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,రాష్ట్ర టి.డి.పి.నాయకుడు రఘుచంద్ర గుప్త,స్థానిక నాయకులు ,మండల నాయకులు పాల్గొని
ప్రత్యేక పూజలు చేపట్టారు.నిర్వాహకులు కిషోర్ గౌడును పూలతో,శాలవు తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే మండల ఎం.పి.పి. మొగసాల రెడ్డెప్ప పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

