
*అన్నమయ్య జిల్లా…*
*పాత కూరగాయల మార్కెట్ లో గల సమస్యలన్నిటికీ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం…*
*మంత్రి దృష్టికి తీసుకెళ్లి టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించె దిశగా అడుగులు…*
*రాయచోటి పట్టణంలోని మార్కెట్ ను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి సోదరుడు డా…లక్ష్మీప్రసాద్ రెడ్డి…*
రాయచోటి పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మణ్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి విక్రయ దారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో మౌలిక సదుపాయాలు కావలసిన మేరకు లేకపోవడంతో ఇటు వ్యాపారస్తులు అటు కొనుగోలుదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తద్వారా ప్రజలు మార్కెట్ లోనికి వచ్చి కూరగాయలు కొనే పరిస్థితులు లేవని ఆయన తెలిపారు. మార్కెట్ మార్కెట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రహరీ గోడ, గేట్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాపారస్తులు తెలిపారని వారం రోజులోగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.గతంలో ఒక్కొక్కరికి రెండు లేదా అంతకంటే ఎక్కువ షాపులు ఉన్నాయని తెలిసిందని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క షాపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సోదరుడు తెలిపారు. ప్రతి సంవత్సరం టమోటా కు గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాటా రైతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలో మంత్రితో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు
మన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు మరొక అనువైన స్థలంలో నూతన మార్కెట్ ను ఏర్పాటు చేసి వారిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని రవాణా శాఖ మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

