
పత్రికా ప్రకటన
తిరుమల, 2025 ఫిబ్రవరి 21
టీటీడీకి మినీ ట్రక్కు విరాళం
తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ శ్రీ మోహన్ రాజుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజ పాల్గొన్నారు.

