
*ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం*
పిచ్చాటూరు లో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి శుక్రవారం 25 కిలోల బియ్యం రూ.7 వేలు ఆర్థిక సాయం ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందించారు.
నాలుగు రోజుల క్రితం స్థానిక బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ సమీపంలో ఇంద్ర, కుప్ఫయ్య దంపతుల పూరిళ్లు అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిచ్చాటూరుకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఇళ్లు కోల్పోయిన ఇంద్ర, కుప్పయ్య దంపతులకు ఎమ్మెల్యే తక్షణ సాయంగా 25 కిలోల బియ్యం, రూ.7 వేలు నగదును పంపిణీ చేశారు.
అలాగే ప్రభుత్వం అందించే పక్కా ఇల్లు మంజూరు చేస్తామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ సుధాకర్, వీఆర్ఓ కృష్ణన్, ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్, తెలుగుదేశం పార్టీ నాయకులు పద్దు రాజు, వెంకటరత్నం నాయుడు, భక్తా రెడ్డి, వినాయగం రెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

