
*నాగలాపురంలో ఎమ్మెల్యేచే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం*
*ఉదయం 10 గంటలకు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం*
*వడ్లకుప్పంలో రూ.13.5 లక్షలతో నిర్మించిన త్రాగునీటి పైప్ లైన్ ప్రారంభం*
నాగలాపురం మండలం లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఉదయం 10 గంటలకు నాగలాపురం చేరుకొని ఈ నెల 18న మృతి చెందిన రామచంద్రన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.
అక్కడ నుండి నాగలాపురం ఈస్ట్ హరిజన వాడకు చేరుకొని రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
తదుపరి మండలంలోని వడ్ల కుప్పం గ్రామానికి ఎమ్మెల్యే చేరుకొని రూ.13.50 లక్షలతో నూతనంగా నిర్మించిన త్రాగునీటి పైప్ లైన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ది వేగంగా జరుగుతోందన్నారు.
గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

