
*శ్రీ వాళీశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *మహా శివరాత్రి పోస్టర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే*
పిచ్చాటూరు మండలం రామగిరిలోని శ్రీ వాళీశ్వర స్వామిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు దర్శన భాగ్యం కల్పించారు.
ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, ఈఓ ఆలయ మర్యాదలు చేయగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈఓ లత తో కలిసి ఎమ్మెల్యే మహా శివరాత్రి బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు సుమాంజలి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్దు రాజు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

