Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు

*ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు*

సీఎం చంద్రబాబు ఏప్రిల్ నుంచి పల్లెబాట పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్-1, ఆపై స్థాయి అధికారులు ఏప్రిల్ నెల నుంచి గ్రామ పర్యటనలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

గ్రామాల్లో రెండు నుంచి మూడు రోజులు గడిపితే కొత్త విషయాలు తెలుస్తాయని.. పట్టణాల కన్నా గ్రామాలు మంచి స్థితిలో ఉన్నాయని, వాతావరణం, మౌలిక సదుపాయాలు కూడా మరింత మెరుగ్గా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఒక్కో జిల్లాను ఒక్కో సీనియర్‌ అధికారి దత్తత తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వినూత్న ఆలోచనలు వస్తాయి. రాష్ట్రంలో 5 జోన్లు ఏర్పాటు చేస్తాం.. అక్కడికి వెళ్లి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధాన సమస్యల్ని పర్యవేక్షిస్తే చాలావరకు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని సీఎం వెల్లడించారు. ఆర్థికేతర అంశాలన్నీ మీరు పరిష్కరించాలి. డబ్బులు లేవని పనులు నిలిపేయడం కాదు. పరిష్కారాన్ని గుర్తించాలన్నారు.

ఉగాది రోజున పీ-4 విధానాన్ని ప్రారంభిస్తాం. అదేరోజు హ్యాపీ సండే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఎన్నికల హామీలను ప్రాధాన్యంగా అమలు చేస్తాం. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్, పీపీపీ మోడల్‌ తదితర వనరులు అన్వేషించాలి. నిర్దిష్టమైన ప్రణాళికను అనుసరించాలి. జీఎస్డీపీ 15 శాతం వృద్ధిరేటు సాధిస్తే తప్ప ఆర్థిక పరిస్థితి మెరుగవదు. ప్రజల్లో మనపై అంచనాలు చాలా ఉన్నాయి. వాటిని సంతృప్తిపరచాలంటే వృద్ధిరేటు అధికంగా ఉండాలి’ అని అన్నారు.

Related posts

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే వినియోగించండి

Garuda Telugu News

365రోజుల్లో వందపడకల ఆసుపత్రి ప్రజలకు అంకితం!

Garuda Telugu News

అడవి జంతువులను వేటాడే ఇరువురిని రిమాండ్ తరలించిన 

Garuda Telugu News

Leave a Comment