
గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం
AP: ఏపీలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటు బాధితులను రక్షించే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటుకు గురైన వారికి గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబడతాయి. అత్యవసరమైతే రోగికి వెంటనే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

