
*08-02-2045 8.30 నుండి 11 గంటల వరకు పిచ్చాటూరు మండలంలో పవర్ కట్*
పిచ్చాటూరు మండలంలో శనివారం ఉదయం 8:30 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ కె సుబ్రహ్మణ్యం తెలిపారు.
సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ నేపథ్యంలో పిచ్చాటూరు తో పాటు కారూరు గోవర్ధనగిరి వేలూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఈ విద్యుత్ అంతరాయం కలగనున్నట్లు ఆయన వివరించారు.
వినియోగదారులు విద్యుత్ సరఫరా నిలిపివేత కు అన్యధా భావించకుండా సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

