
*పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు విన్నపం..*
పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న *”గ్రీవెన్స్ డే (Grievance Day)”* కార్యక్రమం ప్రతి *”శనివారం”* చిత్తూరులోని పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయంలో జరుగును.
తేదీ: 08/02/2025 శనివారం
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
స్థలం: పూతలపట్టు శాసనసభ్యులు గారి కార్యాలయం, కొంగారెడ్డిపల్లె, లక్ష్మీ నగర్ కాలనీ, చిత్తూరు.
ఈ *”గ్రీవెన్స్ డే (Grievance Day)”* లో *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్* పాల్గొంటారు. ఈ అవకాశం ద్వారా పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, విన్నపాలు మరియు అభ్యర్థనలను నేరుగా శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలను పొందవచ్చు.
సమస్యలను స్వయంగా వ్యక్తపరచుకునే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.
*పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయం, చిత్తూరు*

