
*వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వాదం అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..*
బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 7
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ ఎం.ఆర్.సీ.మోహన్ నాయుడు, మాధవీ దంపతుల కుమార్తె రమిత వివాహ వేడుకలకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. బెంగుళూరులోని కె.బి.ఎల్.సారంగ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన రమిత మరియు సత్య రవీంద్రల వివాహ వేడుకల్లో పాల్గోని నూతన వధూవరులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నిండు మనస్సుతో అక్షింతలు వేసి ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులకు సదా సుఖసంతృప్తులతో, ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆయన ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నాయకులు పాల్గోన్నారు.

