
*తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన*
ఏపీలో తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.

