
ఘనంగా టిడిపి యువనేత మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు
బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 6
బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన టిడిపి నేత, గ్రానైట్ యూనియన్ సంయుక్త కార్యదర్శి రాళ్లపల్లి మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు గురువారం తన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్,మండల టిడిపి నాయకులు ఆధ్వర్యంలో మోహన్ నాయుడు దంపతులను సన్మానించి భారీ కేకు కోసి అందరికి పంచి పెట్టారు.మోహన్ నాయుడుకు టిడిపి అగ్ర నాయకులు, శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో, ఎన్. పి. జయచంద్ర నాయుడు, ఎన్ పి. సూరి నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు,పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

