Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అగ్రకులోన్మాద దాడి , ఆటో డ్రైవర్ మృతి కేసులో పోలీసుల అదుపులో నిందితులు?

 

*అగ్రకులోన్మాద దాడి , ఆటో డ్రైవర్ మృతి కేసులో పోలీసుల అదుపులో నిందితులు??*

⚫_నిఘా నీడలో ముగిసిన లక్ష్మయ్య అంత్యక్రియలు

⚫_బలమైన సెక్షన్లు కింద కేసు నమోదు చేసిన పోలీసులు

⚫_24 గంటల్లోనే నిందితులు అరెస్ట్!? కొనసాగుతున్న దర్యాప్తు

కులోన్మాదం జడలు విప్పి నాట్యం చేస్తున్న ఈ భారతవనిలో ఎదురు తిరిగి ప్రశ్నించాడని ఆటో డ్రైవర్ ను అగ్రవర్ణానికి చెందిన భూస్వాములు కులం పేరుతో దూషించి దాడి చేసి బాధితుడు మరణానికి కారణమైన వైనం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఓబులురాజుకండ్రిగ అరుంధతివాడలో కలకలం రేపిన విషయం అందరికీ విధేయతమే, ఈ తరుణంలో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పుత్తూరు డిఎస్పి రవికుమార్ సారధ్యంలో స్థానిక సీఐ మురళి నాయుడు బృందం ఈ కేసులో దూకుడు పెంచింది, ఆటో డ్రైవర్ లక్ష్మయ్యను కులం పేరుతో దూషించి తీవ్రంగా దాడి చేసి మృతికి కారణమైన ముద్దాయిను 24 గంటలు గడవకముదే స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది, అట్రాసిటీ కేసుతో , పాటు దాడిలో బాధితుడు చికిత్స పొందుతూ మరణించడానికి సంబంధించి బలమైన సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు, ఈ నేపథ్యంలోనే అగ్రవర్ణాల చేతిలో దళితుడు హత్య గావించబడ్డాడు అన్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్ , వైఎస్ఆర్సిపి నాయకులు ఆందోళనకు సన్నద్ధమయ్యారు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఒక దళితుడైన ఆటో డ్రైవర్ ఎదిరించి ప్రశ్నించాడని ఒక నెపంతో ఇంటికి వచ్చి దాడి చేసి బాధితుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఈ నేపథ్యంలో స్థానిక సీఐ మురళి నాయుడు, దళిత నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులతో, కుటుంబ సభ్యులతోపాటు వైఎస్ఆర్సిపి, స్థానిక కూటమి పార్టీ నాయకులు గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి పరిస్థితిని వివరించారు, జరిగిన ఘటన, జరగాల్సిన న్యాయాన్ని చెప్పి వారిని ఒప్పించారు, ఈ క్రమంలో సున్నితమైన అంశం కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు, పుత్తూరు సబ్ డివిజన్లోని పోలీసు బృందాలతో పహారాను ఓబులురాజులకండ్రిగ గ్రామంలో ఏర్పాటుచేసి నిఘా నీడలో లక్ష్మయ్య అంత్యక్రియను నిరాడంబరంగా నిర్వహించారు, బాధిత కుటుంబానికి పోలీసులు బాసటగా నిలిచారు, అన్ని విధాల హత్య కావించబడ్డ కుటుంబానికి న్యాయం చేస్తామని, హత్య చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని దర్యాప్తును వగవంతం చేసి న్యాయస్థానం ముందు ఉంచుతామని భరోసా ఇచ్చారు, నిందితులను లక్ష్మయ్య అంత్యక్రియలు ముగిసేలోపు అరెస్ట్ చేస్తామని చెప్పినట్లు తెలిసింది, అందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న జగదీష్ రాజు, భాస్కర్ రాజు అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వినికిడి, లక్ష్మయ్య అంత్యక్రియల సందర్భంలో ఆందోళనలు ఆవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో అటువంటి ఘటనలకు అవకాశం కల్పించకుండా దాదాపు ఒక డిఎస్పి , ముగ్గరు సీఐలు,7 మంది ఎస్ఐలు, 25 మంది పైచిలుకు ఇతర పోలీస్ సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షించినట్లు సమాచారం, మొత్తానికి ఆటో డ్రైవర్ లక్ష్మయ్య అంత్యక్రియలు స్వగ్రామం ఓబుల రాజు కండ్రికి గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు! అందరితో కలివిడిగా ఉంటూ సరదాగా తిరిగే ఆటో డ్రైవర్ లక్ష్మయ్య మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది, కుటుంబ సభ్యుల రోదనలు ఉంటాయి,

⚫ *బాధిత కుటుంబానికి వైసీపీ పరామర్శ!* 💐

సత్యవేడు మండలంలోని ఓబులురాజుల కండ్రిగ గ్రామం అరుంధతివాడలో మృతి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మయ్య కుటుంబానికి వైఎస్ఆర్సిపి బాసటగా నిలిచింది, మంగళవారం మృతి చెంది తిరుపతి ఆసుపత్రిలో ఉన్న లక్ష్మయ్య పార్థివదేహాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దెల గురుమూర్తి, సత్యవేడు వైసిపి సమన్వయకర్త నూక తోటి రాజేష్, వైసీపీ సీనియర్ నేత మాజీ జడ్పిటిసి బీరేంద్ర వర్మ, మరో నేత భాను ప్రకాష్ రెడ్డి నివాళులర్పించి పరామర్శించారు, అదేవిధంగా బుధవారం లక్ష్మయ్య స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో సైతం రాజేష్ , బీరేంద్ర రాజు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి పలకరించారు, వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే లక్ష్మయ్యలను కోల్పోవడం బాధాకరమన్నారు, పార్టీ తరఫున వ్యక్తిగతంగా

లక్ష్మయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు!

 

 

 

 

 

 

Related posts

అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం దారుణం

Garuda Telugu News

అక్రిడేషన్ గడువు పొడిగింపు! జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ 

Garuda Telugu News

సత్యవేడు మండలంలో ఘనంగా నాగుల చవితి పండుగ

Garuda Telugu News

Leave a Comment