Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చెన్నైలో శ్రీసిటీ-శ్రీవాణి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

*చెన్నైలో శ్రీసిటీ-శ్రీవాణి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు*

 

శ్రీసిటీ, ఫిబ్రవరి 05, 2025:

 

శ్రీసిటీ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాలు, రాష్ట్రాల వరకు శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య వేదిక శ్రీవాణి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాభిమానులను అలరిస్తోంది. ఇటీవల చెన్నైలోని వివిధ ప్రాంతాలలో స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించిన శ్రీనివాస పెరుమాళ్ ఆలయ కుంభాభిషేకం, త్యాగరాజ సంకీర్తనార్చన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంది.

 

*వైభవంగా శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయ కుంభాభిషేక మహోత్సవం …*

 

చెన్నై రాయపేటలోని శ్రీదేవి భూదేవీ సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలో గత సోమవారం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆధ్వర్యంలో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో తమిళనాడు ప్రభుత్వ హిందూ మత పరిరక్షణ, ధార్మిక సంస్థల శాఖ మంత్రి పి.కే.శేఖర్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారులకు డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కే.ఈ.హెచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆలయ ధర్మకర్త వసంత్ కుమార్, ఆలయ కమిటీ కార్యదర్శి పి.రవీంద్ర కుమార్ రెడ్డి సమక్షంలో ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

 

అలాగే, కుంభాభిషేకానికి ముందు రోజున శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలో వేద పండితులు యాగాలు, విశేష పూజలు, ధార్మిక ప్రవచనం, వేదపారాయణం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు స్వామి వారికి భక్తి పూర్వకంగా, పూర్ణకుంభ స్వాగతం పలికారు.

 

200 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని సమగ్రంగా పునరుద్ధరించిన అనంతరం నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం భక్తుల విశేష ఉత్సాహాన్ని చాటింది. ఈ ఆలయానికి సంబంధించి ఇది 2500వ కుంభాభిషేకం కావటం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. విశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వారి కృపను పొందారు.

 

*అలరించిన త్యాగరాజ సంకీర్తనార్చన విభావరి …*

 

చెన్నై వేద విజ్ఞాన వేదికతో కలసి సంయుక్తంగా చెన్నైలోని ఆంధ్రా క్లబ్ గోదావరి హాలులో చేపట్టిన త్యాగరాజ సంకీర్తనార్చనా విభావరిలో కుమారి మల్లాది అనూష బృందం త్యాగరాజ కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి అలరించారు. నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూషతో పాటు, బృందంలో తిరుపతికి చెందిన సాయి శివ శ్రవణ్, అక్కిశెట్టి నరేష్, చెన్నైకి చెందిన కుమారి పవిత్ర పాల్గొన్నారు. వీరు ఆలపించిన ‘వందనము రఘు నందనా సేతుబంధన, సామజ వరగమన, ఎందరో మహానుభావులు, రామ కోదండ రామా కల్యాణ రామ’, వంటి వివిధ త్యాగరాజ కీర్తనలు ఆహూతులకు వీనుల విందు చేశాయి. ఇందులో వయోలిన్ పై సంకీర్తకుమార్ (తిరుపతి), మృదంగంపై కృష్ణవంశి (తిరు పతి) వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంగీత కళాకారులను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా.రవీంద్ర సన్నారెడ్డి, వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు తదితరులు ఘనంగా సత్కరించారు. ఆస్కా అధ్యక్షులు సుబ్బారెడ్డి, అనేక మంది తెలుగు ప్రముఖులు, సాహితీ వేత్తలు పెద్దసంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫోటోలు:

01, 02, 03, 04 – ఆలయ కుంభాభిషేక మహోత్సవం దృశ్యాలు

05, 06 – త్యాగరాజ సంకీర్తనార్చన విభావరి దృశ్యాలు

Related posts

బాబన్న…. సత్యవేడు రోడ్ల దుస్థితి చూడన్నా….!

Garuda Telugu News

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తేదీ పొడిగించడం

Garuda Telugu News

రోడ్డు ప్రమాద మృతుడు ఏసు కుటుంబాన్ని ఆదుకుంటాం

Garuda Telugu News

Leave a Comment