Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే పోరాటం చేస్తోంది..!

 

*జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే పోరాటం చేస్తోంది..!*

 

*స్వార్థం కోసం వచ్చే వారిని పక్కన పెట్టాలి* – *నేతల స్పష్తీకరణ*

 

 

కాణిపాకం : జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేసేది ఒక్క ఏపీయూడబ్ల్యూజే నని ఆయన కుండ బద్దలు కొట్టారు. తాను కూడా ఆ గూటి నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం కేంద్రంలో ఆదివారం ఘనంగా ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు తిరుపతి జిల్లాల విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు.

 

*జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే తోనే మేలు*

 

ముఖ్య అతిథి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ గత చాలా సంవత్సరాలుగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల పక్షాన ఉంటూ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. జర్నలిస్టులకు మేలు జరిగిందంటే అది ఏపీయూడబ్ల్యూజే తోనే అని అన్నారు.

 

*సీనియర్ జర్నలిస్టులకు ప్రతినెల పెన్షన్ మంజూరు*

 

చిత్తూరు జిల్లా అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టులకు ప్రతినెల పెన్షన్ మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదన పెట్టాలని కోరారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ ప్రధానమని, 70వ దశాబ్దంలోకి అడుగుతున్న ఏపీయూడబ్ల్యూజేకు ఏ ఒక్క యూనియన్ ప్రత్యామ్నాయం కాబోదని ధీమా వ్యక్తం చేశారు.

 

*జర్నలిస్ట్ లకు అండగా Apuwj*

 

ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు తలెత్తిన ఏపీయూడబ్ల్యూజే అండగా ఉండే సంఘం అని తెలిపారు. మాయ మాటలు చెప్పే ఇతర సంఘాలకు ఏపీయూడబ్ల్యూజే కి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు.

 

*స్వార్థం కోసం వచ్చే వారిని పక్కన పెట్టాలి*

 

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బండపల్లి అక్కులప్ప మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలోనే బలమైన సంఘం అని అన్నారు. . *స్వార్థం కోసం వచ్చే వారిని పక్కన పెట్టాలన్నారు.* ఏపీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదును పెంచేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

 

అనంతరం ముఖ్య అతిధుల చేతుల మీదుగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నూతన డైరీలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావును దుశాలువ తో ఘనంగా సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, కాళేశ్వర్ రెడ్డి, వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ

Garuda Telugu News

అంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం

Garuda Telugu News

రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్

Garuda Telugu News

Leave a Comment