
*
✳️ *తిరుమల శ్రీవారి రథసప్తమి సూర్య జయంతి) ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులు మరియు టిటిడి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు.*
✳️ నాలుగు మాడా వీధుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా శ్రీవారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు.
✳️ పోలీసులు భక్తి భావంతో విధులు నిర్వహిస్తూ, భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి.
✳️ తిరుమల, తిరుపతి నగరం నందు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
✳️ భక్తులు పోలీసు వారి సూచనలను యధావిధిగా పాటించాలని విజ్ఞప్తి.
*నాలుగు మాడా వీధుల్లో పర్యటించి బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది కి పలు సూచనలు చేసిన ఏస్పీ గారు*
✳️ *పోలీసు మరియు టిటిడి ఉద్యోగుల సమన్వయంతో పని పనిచేసి రథసప్తమి ని విజయవంతం చేయాలని ఎస్పీ గారు సూచించారు.*
✳️ *ఈనెల 04 వ తేదీన జరగనున్న తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల నిర్వహణపై జిల్లా పోలీస్ భద్రతాపరమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ, అధికారులకు సూచించారు.*
తిరుమలలోని ఆస్థానం మండపంలో 4.2.2025 జరుగు రథసప్తమి పండుగ సందర్భంగా టిటిడి ఈఓ శ్రీ శ్యామలరావు, ఐఏఎస్, శ్రీ వెంకయ్య చౌదరి ఐఏఎస్ మరియు శ్రీ మణికంఠ చందోలు ఐపీస్ ఎస్. ఒ టీటీడీ గార్లతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ., ఒకే రోజు స్వామి వారి 7 వాహన సేవలు 04 02.2025 వ తేదిన రథసప్తమి రోజున టిటిడి వారు నిర్వహించానున్నందున స్థానిక భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అశేషంగా భక్తులు ఈ రథసప్తమి కి రావడం ఆనవాయితి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసులు నిరంతరం భక్తి భావంతో విధులు నిర్వర్తిస్తూ భక్తులతో మర్యాదపూర్వకంగా, హుందాగా మెలిగి తిరుపతి జిల్లా పోలీసుల ఖ్యాతిని పెంచాలని సూచించారు. అదే సమయంలో భక్తులు, యాత్రికులు పోలీసు వారి సూచనలను యధావిధిగా తప్పకుండా పాటించి, నిర్దేశిత పార్కింగ్ ఏరియాలో మాత్రమే తమ వాహనాలను పార్కింగ్ చేసి మరింత మెరుగైన సేవలను పొందాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పి గారు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలనీ, ఈ ప్రాంతాలను సెక్టార్ లుగా విభజించి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసి, అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ఇన్చార్జులు గా నియమించి, వారు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ రామకృష్ణ అదనపు ఎస్పి తిరుమల జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.
వాహన సేవల వివరాలు
– ఉ. 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
– ఉ. 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
– ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
– మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
– మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
– సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
– సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
– రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
