
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్
-యువతలో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ ప్రధాన లక్ష్యం
– డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి
రేణిగుంట:
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ కార్యక్రమాన్ని ఆయన రేణిగుంట రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థులకు రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సమైక్యత యాత్ర నాయకత్వ లక్షణాలను బలపరుస్తాయని తెలిపారు. విభిన్న ప్రాంతాలలో విభిన్న సంస్కృతులు, భారతీయ సమైక్యతను చాటే పద్ధతులు , సిద్ధాంతాల గురించి యువత తెలుసుకునేందుకు ఇలాంటి యాత్రలు ఉపయోగకరమన్నారు
