
*తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*
తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్ పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
