
ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ఈనెల 24, 25 తేదీలలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం నందు నిర్వహించనున్న అఖిలభారత యువజన సమైక్యజిల్లా(ఏ ఐ వై ఎఫ్) తిరుపతి జిల్లా రెండవ మహాసభలకు సంబంధించి కరపత్రికలను సత్యవేడు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నందు విద్యార్థులతో కలిసి సమైక్య జిల్లా జాయింట్ సెక్రెటరీ నాగర్జున కరపత్రికలను ఆవిష్కరించడమైనది. సత్యవేడు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం నందు సమైక్య జాయింట్ సెక్రెటరీ నాగార్జున మాట్లాడుతూ ఏఐవైఎఫ్ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వరకు బావి భారతదేశం కొరకు పౌరుల సక్రమమైన జీవనం కొరకు యువతకు అండదండగా ఉంటూ వారి సామాజిక సంఘర్షణలలో ముందు నిలబడి పోరాటాలు చేస్తూ యువతను పెడత్రోవ నుండి తప్పించి సక్రమమైన జీవనానికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇది దేశ యువతకు ముందు నిలబడి వారి బంగారు భవిష్యత్తుపై పోరాడుతుందని ఇలాంటి ఏఐవైఎఫ్ యొక్క మహాసభలు శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ భవన్ నందు నిర్వహించడం శుభసూచకమని అనేకులుగా తరలివచ్చి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
