Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..! _ హైదరాబాద్ యువకుడు మృతి

*ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..!*

_ హైదరాబాద్ యువకుడు మృతి

 

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ భారీ బందోబస్తు కొనసాగుతున్న వాషింగ్టన్ లో కాల్పులు చోటు చేసుకోవడం షాక్ కు గురి చేసింది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మరో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందాడు.

 

*యూఎస్‌లో దుండగుల కాల్పులు.. హైదరాబాదీ మృతి..:* ఇప్పటికే నెలరోజుల క్రితం తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందగా తాజాగా మరో హైదరాబాదీ యువకుడు దుండగుల కాల్పులలో మృతి చెందడంతో ఆ యువకుడి కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 2 లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చి నెలలో యూఎస్ వెళ్ళాడు.

 

*కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు..:* అక్కడ తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నాడు. కొడుకు ఉద్యోగం వచ్చి స్థిర పడతాడని తల్లిదండ్రులు భావించిన వేళ ఊహించని ఘటనలో రవి తేజ మృతి చెందటం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా వాషింగ్టన్ లో దుండగులు జరిపిన కాల్పులలో రవితేజ మృతి చెందాడు. ఇక ఈ సమాచారంతో రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

*గత నవంబర్‌లో ఖమ్మం వాసి మృతి..:* ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చదువు పూర్తిచేసే ఉద్యోగాన్వేషణలో ఉన్న రవితేజ మృతి చెందడం తో అక్కడ ఉన్న తెలుగు వారు తీవ్రభయాందోళనలో ఉన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది నవంబర్ నెలలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు. అమెరికాలోని చికాగోలో దుండగుల కాల్పులలో సాయితేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

 

*వరుస మరణాలతో ఇండియన్స్ బెంబేలు..:* ఎంఎస్ చదవడానికి యుఎస్ వెళ్లిన అతను సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనిపై దుండగులు కాల్పులు జరపగా సాయి తేజ మృతి చెందాడు. సాయి తేజ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదాన్ని చూసింది. ఇప్పుడు హైదరాబాదీ అయిన రవితేజ మరణించడంతో అతని కుటుంబంలోనూ విషాదం చోటుచేసుకుంది. ఇక యూఎస్‌లో ఇండియన్స్ వరుస మరణాలతో అక్కడ ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు.

Related posts

సీయం చంద్రబాబు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నా

Garuda Telugu News

హోం మంత్రి అమిత్ షా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి

Garuda Telugu News

ఆటో డ్రైవర్ సేవలో పథకం

Garuda Telugu News

Leave a Comment