
తెలుగువారి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు.
రామారావు వర్ధంతి వేడుకల్లో టిడిపి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి
.సత్యవేడు గరుడ తెలుగు న్యూస్
తెలుగువారి ఆత్మగౌరవం కోసమే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినట్టు తిరుపతి జిల్లా సత్యవేడు టిడిపి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు,అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.
ఇందులో భాగంగా సత్యవేడు పట్టణం గాంధీ విగ్రహం వద్ద మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్,సమన్వయకర్త శ్రీపతి బాబు,మాజీ మండలాధ్యక్షులు పరమశివం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు.కష్టజీవుల కన్నీళ్లు,అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందన్నారు.ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.ఇందులో భాగంగానే రెండు రూపాయలకు కిలోబియ్యం,మహిళలకు ఆస్తుల్లో సమాన వాట,మండళీకరణ వ్యవస్థ,తెలుగు గంగ ప్రాజెక్టు వంటివి ఎన్నో ఉన్నట్టు ఆయన వివరించారు.
ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని చెప్పారు.దీంతోపాటు అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు.ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమని ఆయన స్పష్టం చేశారు. కేవలం నటనలోనే కాక రాజకీయాల్లో ఎన్టీఆర్ రాణించారన్నారు.అంతకుమునుపు టిడిపి నేతలు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.తదనంతరం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టిడిపి మండలాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులతో కలిసి పలువురికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రామిరెడ్డి,లోకయ్య రెడ్డి,బాలసుందరం రెడ్డి,మురళి( చికెన్ చిన్న),రాధాకృష్ణయ్య,శశిమోహన్ నాయుడు,దిలీప్, జగన్నాథ రెడ్డి,జడేరి బాబు,షణ్ముగం,సురేంద్ర రెడ్డి,సుబ్రహ్మణ్యం రాజు, హేమభూషణం,శివానందం,మోహన్,అరుల్ నాదన్, ధనశేఖర్,మునినాదం పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
