
*సంక్షేమ ప్రదాత అన్న ఎన్టీఆర్*
*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
*నాగలాపురం లో ఎన్టీఆర్ కు నివాళి, పేదలకు అన్నదానం*
పేద ప్రజల సంక్షేమ ప్రదాత మన నందమూరి తారక రామారావు గారు అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు.
నాగలాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ప్రజల వద్దకు పాలన, మండల వ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు.
ఆయన చేసిన బృహత్తర కార్యక్రమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన పథకాలు ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కుతుందన్నారు.
అనంతరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్, నీటి సంఘ అధ్యక్షుడు సెల్వ కుమార్ మండల కార్యదర్శి పార్టీపన్, నాయకులు పాల్గన్నారు.
