
పత్రికా ప్రకటన
*ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ లో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి.*
*మన ఇల్లు, పరిసరాలు, పని చేసే కార్యాలయాలో పరిశుభ్రత పాటించాలి : డి ఆర్ ఓ నరసింహులు*
.
తిరుపతి, జనవరి 18 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ప్రతి మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను నిర్వహించి విజయవంతం చేయాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం లో భాగంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం, మరుగు కాలువలు శుబ్రపరుచుకోవడం ప్రతి పల్లె, పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ పాటించడం జరుగుతోందన్నారు. దీనివల్ల చాలావరకు వ్యాధులు రావడం తగ్గిందన్నారు. ప్రతి మూడవ శనివారం పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, పరిసరాలు శుబ్రపరుచుకోవాలని తెలిపారు. జిల్లా లో ప్రతి శాఖకు ఒక్క నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, ఈ రోజు మన పరిసరాలను, కార్యాలయాలను ప్రతి ఉద్యోగి వారి కార్యాలయం లోని టేబుల్, ఫైల్స్, ఎలెక్ట్రానిక్ వేస్ట్ వంటి వాటిని శుబ్రపరుచుకోవలన్నారు. కార్యాలయాలలో చెత్తను వేయుటకు డస్ట్ బిన్ ఉపయోగించుకోవాలని, మనం ఎంత శుబ్రంగా ఉంటామో మన పరిసరాలు అంతే శుబ్రంగా ఉంచుకోవాలని అది అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. అనంతరం ప్రతి రోజు పరిసరాల పరిశుభ్రత కొరకు సమయం కేటాయిస్తానని ” స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ” చేసి కార్యాలయ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను సిబ్బంది తో కలిసి శుబ్రపరిచారు.
ఈ కార్యక్రమంలో కల్లెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిఐపిఆర్ఓ తిరుపతి
