
వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యదర్శిగా ..*పాడి లాల్ బాబుయాదవ్*
ఆయన్ను నియమిస్తూ కేంద్ర వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ
*రాజకీయ చాణక్యుడు.. నిబద్దత కలిగిన నాయకత్వం..గాంబీరత్వానికి నిలువెత్తు నిదర్శనం …వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధేయుడు….ఏకగ్రీవంతో కే వీ బీ పురం మండలం కోవనూరు సింగిల్ విండో ఛైర్మెన్ గా, జిల్లా సహకార సంఘం (సీడీసీఎం ఎస్) వైస్ చైర్మన్ గా.. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ రాష్ట్ర డైరెక్టర్ గా .. పనిచేసిన అనుభవజ్ఞులు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు.. పాడి.లాల్ బాబు యాదవ్ వైయస్సార్సీపి ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యదర్శి గా నియమితులయ్యారు*.
సత్యవేడు నియోజకవర్గo కేవీబీ పురం మండలం కు చెందిన ఆయనను నియమిస్తూ .. వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
*38 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం లో..కాంగ్రెస్ వాదిగా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి.. వైయస్సార్ మరణానంతరం ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి..పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి..విధేయతను చాటుకున్న లాల్ బాబు యాదవ్ ను పార్టీ అధిష్టానం గుర్తించి.. జిల్లా కార్యవర్గంలో కీలక పదవికి ఎంపిక చేసింది*.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి క్రియాశీలక కార్యదర్శిగా నియమితులైన పాడి లాల్ బాబు యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ ఆదేశాలను శిరసా వహించి.. విధేయతతో పనిచేసి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు.
. *ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి సారధ్యంలో.. తనపై నమ్మకంతో నన్ను జిల్లా క్రియాశీలక కార్యదర్శిగా నియామకం కు కారకులైన సత్యవేడు నియోజకవర్గం సమన్వయకర్త నూక తోటి రాజేష్ గారి నాయకత్వంలో..రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు మా రాజకీయ గురువు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ..తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి గారి సూచనలతో ..పార్టీకి నిబద్ధతగా పనిచేసి ..ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం.. నవరత్నాల సంక్షేమ ప్రదాత ..యువ నాయకత్వం కలిగిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా ..సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండాను విజయం వైపుగా నడిపించి…నూకతోటి రాజేష్ గారి ని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు*.
తన నియామకానికి సహకరించిన కేవీబీపురం మండల వైఎస్ఆర్సిపి నాయకులకు, అలాగే సత్యవేడు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
