
సత్యవేడు పంచాయతీ పరిధిలో చెత్త బుట్టలు పంపిణీ
……….. సత్యవేడు పంచాయతీ పరిధిలో చెత్త బుట్టలను గ్రామ సర్పంచ్ మంజులరమేష్ పంపిణీ చేశారు.ఆదివారం పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సెక్రెటరీ మునిరవికుమార్ పర్యవేక్షణలో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ నేపథ్యంలో పలువురు వార్డు సభ్యులకు చెత్త బుట్టలను గ్రామ సర్పంచ్ మంజులరమేష్ అందించారు.
❄ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డు సభ్యుల ద్వారా ప్రతి ఇంటికి చెత్త బుట్టల పంపిణీ జరుగుతుంది అన్నారు.రోజువారీగా ఇంట్లో పోగొయ్యే చెత్తను తీసుకొచ్చి రోడ్లపై పడేయరాదన్నారు.తప్పనిసరిగా చెత్త బుట్టలో వేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల రాగానే వారికి అందజేయాలన్నారు.తద్వారా పంచాయతీ పారిశుద్ధానికి ప్రజలు సహకరించాలన్నారు.
తదనంతరం పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ చెత్త బుట్టలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ రఫీరాణి,వార్డు సభ్యులు మహేష్,ఢిల్లీ, కోనయ్య,పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, బిల్ కలెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
