
కోడి పందేలపై వింజమూరు ఎస్ ఐ వీర ప్రతాప్ కొరడా
వింజమూరు మండలంలోని తక్కెళ్లపాడు అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందెం స్థావరంపై వింజమూరు ఎస్ ఐ కె వీర ప్రతాప్ కొరడా ఝళిపించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ స్పష్టమైన ఆదేశాల మేరకు కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఉంచిన ఎస్ ఐ వీర ప్రతాప్ తక్కెళ్లపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న కోడి పందెం స్థావరంపై తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 7 మందిని అదుపులోకి తీసుకుని 5 కోళ్లు, 26 వేల 50 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ వీర ప్రతాప్ మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలో ఎక్కడైనా సరే కోడి పందేలు,పేకాట, అక్రమ మద్యం విక్రయాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్బడిన పక్షంలో చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం తధ్యమని హెచ్చరించారు.
