
పలగాటికివరుసగామూడవసారిపట్టం-మండల వైసీపీ హర్షం
కోట (గరుడ ధాత్రి)
తిరుపతి జిల్లా కోట మండలం వైయస్సార్ పార్టీ అధ్యక్షునిగా వరుసగా మూడవసారి పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ని పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డినియమించడం ఎంతో హర్షదాయమని మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పార్టీకి విధేయుడుగా ,వివాద రహితుడుగా పార్టీ కేడర్ ని అందరితోసమన్వయపరుచుకుంటూ ,పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి పలగాటి సంపత్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తికి వరుసగా మూడవసారి మండల పార్టీ పగ్గాలను ఇచ్చినటువంటి గూడూరు నియోజకవర్గ, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకు ,రాష్ట్రనాయకులకు,పార్టీఅధిష్టానంకుకార్యకర్తలు మొదలుకొని పార్టీ శ్రేణులంతా తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు వరుసగా మూడవసారి మండల పార్టీ అధ్యక్షులుగానియమించినందుకు పార్టీ శ్రేణులు అందరికీ ముఖ్యంగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికిమనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అన్ని కోణాలలో సద్వినియోగం చేసుకుంటానని, పార్టీ బలోపేతానికి శాయశక్తుల కృషి చేస్తానని, ఆయన చెప్పారు. కార్యకర్తలు మొదలుకొని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ రాబోవు ఎన్నికలలో పార్టీకి మంచి మెజారిటీ తీసుకొచ్చే దిశగాతానుకృషిచేస్తానన్నారు.
