Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వరదయ్యపాలెం మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

*వరదయ్యపాలెం మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు*

 

*న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి.*

 

*_వరదయ్యపాలెం ఎస్.ఐ మల్లికార్జున_*

వరదయ్యపాలెం (గరుడధాత్రి): మండల ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వరదయ్యపాలెం ఎస్ఐ కోరారు. మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు._

*డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు*

డిసెంబర్ 31 రాత్రి 7 గంటల నుంచి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయి. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. వాహన సీజ్, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటామన్నారు._

*నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు*

ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు_

_మద్యం సేవించి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఇబ్బందులకు గురి చేసే వారిపై మఫ్టీ టీమ్స్ పర్యవేక్షణ చేస్తాయి_

_అక్రమ ఆర్కెస్ట్రాలు, డీజేలు, మైకులు ఉపయోగించడం, బాణసంచా పేల్చడం పూర్తిగా నిషేధం_

*యువతకు హెచ్చరిక*

యువత చట్టపరమైన నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ వీసాలు పొందడం కష్టమవుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు ఉపయోగించే వారి పై ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు జరపడం జరుగుతుందని తెలిపారు._

*తల్లిదండ్రుల బాధ్యత*

తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, మద్యానికి దూరంగా ఉండి శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు._

పోలీసుల సూచనలు పాటించాలి*

నిబంధనలు అతిక్రమించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రజలంతా పోలీసుల సూచనలు పాటించి నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఎస్ఐ మల్లికార్జున సూచించారు._

Related posts

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు

Garuda Telugu News

ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి

Garuda Telugu News

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

Garuda Telugu News

Leave a Comment