
*దేహ దారుడ్య మరియు సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా తీసుకురావాలని చిత్తూరు పోలీసు వారు విజ్ఞప్తి.*
*చదువుకుంటున్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తీసుకురాలేని సందర్భంలో, వారు చదువుతున్న విద్యాసంస్థల నుండి జారీ చేసిన దృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి.*
*కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో రెండవ రోజు కొనసాగిన పరీక్షలు*
*జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్ గారి పర్యవేక్షణలో పకడ్బంధీగా పరీక్షలు.*
*రెండవ రోజు 600 మంది అభ్యర్థులకు గాను 403 మంది హాజరు… వీరిలో 159 మంది అర్హత సాధించారు.*
స్టైఫండరీ కేడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల దేహ దారుడ్య మరియు సామర్థ్య పరీక్షలు చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ మైదానంలో రెండవ రోజు కూడా పకడ్బంధీగా కొనసాగాయి. రెండవ రోజు 600 మంది అభ్యర్థులకు గాను 403 మంది హాజరు… వీరిలో 159 మంది తదుపరి వ్రాత పరీక్ష కు అర్హత సాధించారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్ స్వీయ పర్యవేక్షణలో రెండవ రోజున సిబ్బంది మరియు అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి అభ్యర్థుల సామర్థ్యపు పరీక్షలను త్వరితగతిన ముగించారు. హాజరయిన 403 మందికి సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ మెజర్మెంట్ లో భాగంగా ఎత్తు, ఛాతీ కొలిచారు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించగా 159 మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు( APSLRB) ఆదేశాలు, నియమ నిబంధనలు మేరకు ఈ పరీక్షలు పటిష్టంగా జరిపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలు… బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఆర్.ఎఫ్.ఐ.డి ట్యాగుల పంపిణీ, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు( 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్) రిజల్ట్ కౌంటర్ వరకు కేటాయించిన విధులను సిబ్బంది పకడ్బంధీగా నిర్వహించారు. ఇక పరుగు పందెం లో అలసిన అభ్యర్థులకు వైద్యులు ప్రధమ చికిత్చ అందించారు.
భర్తీ పక్రియ పారదర్శకముగా మరియు పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ పాటవల ఆధారంగానే జరుగుతుందని, కావున అభ్యర్థులు మరియు వారి తల్లితండ్రులు దళారులను మరియు మధ్యవర్తులను నమ్మకుండా, మోసపోకుండా ఉండవలనని, ఎవరైనా మేము భర్తీకి సహకరిస్తాము అని నమ్మబలికిన డయల్ 112 కు గాని చిత్తూరు పోలీసు Whatsapp నెం. 9440900005 కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేయవలనని పోలీసు వారి విజ్ణప్తి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి ఏ.ఆర్ శ్రీ శివానంద కిషోర్, చిత్తూర్ టౌన్ DSP శ్రీ టి.సాయినాథ్, ఏ.ఆర్. డి.ఎస్.పి లు శ్రీ చిన్ని కృష్ణ, శ్రీ మహబూబ్ బాష, ఎస్.బి. ఇన్స్పెక్టర్ లు శ్రీ భాస్కర్, శ్రీ మనోహర్, ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ జయరామయ్య, రిజర్వు ఇన్స్పెక్టర్ లు శ్రీ సుధాకర్, శ్రీ చంద్రశేఖర్, ఏం.టి.ఒ శ్రీ భాస్కర్, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ, ఏ.ఓ.ఓ, సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఐ.టి కోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
