
*ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు💐*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం👍*
మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
2025లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
“సత్యవేడు నియోజకవర్గ ప్రజలతో పాటు, తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2025లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి” అని కోరుకున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
నియోజవర్గంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 2025లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వలోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.
