06-12-2025
*జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి*

తిరుపతి,డిసెంబర్ 6:భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్ కుమార్ గారు తమ కార్యాలయం లో అంబేద్కర్ గారి చిత్రపటానికి గౌరవపూర్వక నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత దిశానిర్దేశం చేసిన మహనీయులని,ఆయన ఆలోచనలు నేటికీ అన్ని రంగాలకు మార్గదర్శకమవుతున్నాయని,ఆయన జీవితం మొత్తం సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత, మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటాల సంకలనం అని తెలుపుతూ “విద్య లేకుండా మానవుడు సంపూర్ణంగా ఎదగలేడు” అనే ఆయన నమ్మకం కారణంగా దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధికి బలమైన పునాది వేయబడిందని ఉపాధ్యాయులు విద్యార్థుల్లో రాజ్యాంగ విలువలు, సమానత్వ భావన, సామాజిక చైతన్యం పెంపొందించే దిశగా కార్యకలాపాలు నిర్వహించడం అవసరమని పేర్కొంటూ విద్యార్థులందరూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో న్యాయం, సమానత్వం, సత్యనిష్ఠ వంటి విలువలను జీవితంలో ఆచరించాలని రాజ్యాంగం అందించిన హక్కులను గౌరవిస్తూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎదగాలని సూచించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం బలపడాలి, విద్యార్థులు చైతన్యవంతులు కావాలి, అదే అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్ అధికారి ధనుంజయ నాయుడు,అకడమిక్ మానిటరింగ్ అధికారి డా. చంద్రశేఖర్ నాయుడు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు డా. సుధాకర్, మీనాక్షి, సారథి, పుష్ప, భువనేశ్వరి మరియు విద్యాశాఖ, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
