Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా…

*నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా…*

*రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

 

*రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలబెట్టిన చారిత్రాత్మక నిర్ణయానికి పట్టణంలో మంత్రికి జేజేలు*

 

*ప్రైవేట్ విద్యాసంస్థల జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన—‘థ్యాంక్యూ సీఎం సార్’ సభకు అపూర్వ స్పందన*

 

*మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జిల్లా సాధన సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి,ప్రైవేట్ విద్యాసంస్థల రాష్ట్ర జెఏసి కన్వీనర్ డాక్టర్ పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి లు*

 

*రాయచోటి న్యూస్*

 

నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలబెట్టినందుకు మంత్రి మండిపల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ప్రైవేట్ విద్యాసంస్థల జెఏసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు.ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాయచోటికి జిల్లా కేంద్ర హోదా ఇవ్వడానికి అన్ని అర్హతలు, అన్ని ప్రమాణాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి,ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిజం చేసి,జిల్లా కేంద్రాన్ని రాయచోటిలోనే కొనసాగించడం ప్రజల ఆశయానికి గౌరవం అని అన్నారు.10 వేల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ మహా ర్యాలీ చెక్ పోస్ట్ శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు కోలాటాలు,చెక్క భజనలతో గొప్ప ఉత్సాహంతో సాగింది.నినాదాలతో యువత సందడితో రాయచోటి పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

 

*ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి మాట్లాడుతూ*

 

రాయచోటిని జిల్లా కేంద్రంగా కాపాడడంలో మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి చేసిన కృషి అపారమైందని,ఆయన ముందడుగు వల్లే ప్రజల ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు.అనంతరం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి,మదన మోహన్ రెడ్డి లు ఘనంగా సత్కరించగా,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ టిడిపి నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,మౌర్యా రెడ్డి,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా,ఏపీఐఐసి డైరెక్టర్ కొండా భాస్కర్ రెడ్డి,టిడిపి పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్ వలీ,నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు,జనార్దన్,జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ రాజారెడ్డి,బిట్స్ భాస్కర్, సాయి ఇంజనీరింగ్ సుధాకర్ రెడ్డి,షిరిడీ సాయి చలమారెడ్డి,శ్రీహరి డిగ్రీ కళాశాల రాజశేఖర్,భారతి విద్యామందిర్ వెంకట్రామిరెడ్డి,వశిష్ఠ ప్రభాకర్,ఎస్.వి విద్యామందిర్ రమణారెడ్డి,ఐ కె స్కూల్ ఇషాక్,ప్రభుత్వ,ప్రయివేట్ కళాశాలల విద్యార్థులు,వైద్యులు డా లక్ష్మీ ప్రసాద్,డా చింతల అరుణ్,డా ప్రభాకర్ రెడ్డి,డానారాయణరెడ్డి,డా కేతిరెడ్డి సాయి కృష్ణారెడ్డి ,ప్రముఖ న్యాయవాదులు,రోటరీ క్లబ్ కూనా కృష్ణ దేవరాయలు,పెట్రోల్ బంక్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…

Garuda Telugu News

స్థానిక ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చర్యలు తీసుకోవాలి- సిపిఎం 

Garuda Telugu News

సత్యవేడు పంచాయతీ పరిధిలో చెత్త బుట్టలు పంపిణీ

Garuda Telugu News

Leave a Comment