*తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM)3.0)ను జయప్రదం చేయండి* :

*విద్యార్థుల తల్లిదండ్రులకు…డీవీఎంసీ మెంబెర్ గుత్తి త్యాగరాజు విజ్ఞప్తి.*
వరదయ్యపాలెం, డిసెంబర్ 04.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్ ను ఉన్నంతంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రధాని మోదీజీ,సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణి,విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గార్లు ప్రత్యేక కృషి చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 5 న మెగా పిటిఎం 3.0ను నిర్వహిస్తున్నారు.*
*విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమన్వయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 3.0 ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు పిలుపునిచ్చారు.*
ఈ కార్యక్రమం ద్వారా:
✔️ విద్యార్థుల వ్యక్తిగత పురోగతి
✔️ చదువులో ఎదురవుతున్న సమస్యలు
✔️ పాఠశాల – తల్లి దండ్రుల సమన్వయం
✔️ విద్యా ప్రమాణాల అభివృద్ధి
✔️ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు
వంటి కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలిపారు.
“పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల పాలుపంచుకోవడం ఎంతో అవసరం. *ఉపాధ్యాయులు బోధిస్తారు… తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు*… ఈ రెండు కలిసి వస్తేనే విద్యార్థి జీవితంలో మార్పు వస్తుంది.” అని గుత్తి త్యాగరాజు చెప్పారు.
ఈ సమావేశాన్ని ప్రతి తల్లిదండ్రి ఒక బాధ్యతగా తీసుకొని హాజరై… పిల్లల విద్యా, భవిష్యత్ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు కోరారు.
