ప్రైవేటు స్కూళ్ల ఫీజుల బాదుడు, ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

ఆంద్రప్రదేశ్
ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక కారణంతో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి.
పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల్లోనూ భారీ గా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ప్రభుత్వ పరీక్షల విభాగం నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించాల్సింది 125 రూపాయలైతే, అందుకు చాలా రెట్లు ఎక్కువగా విద్యార్థుల నుంచి ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఒక్కో విద్యార్థి నుంచి రూ.900 నుండి 2000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 125 కంటే అదనంగా ఎక్కడైనా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ స్పష్టం చేసారు. అదనపు వసూళ్లపై ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
