ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి

జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
కీలగరం సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
సత్యవేడు నియోజకవర్గంలో ఇళ్ళు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు.
గురువారం సాయంత్రం నారాయణవనం లో ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు.
ప్రజా దర్బార్ లో ప్రజల నుండి స్వీకరించిన 230 అర్జీలలో 190 ఇంటి పట్టాలు కోరుతూ ఇచ్చినవే అని ఎమ్మెల్యే వివరించారు.
వీటి పరిష్కారంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాలనీలో గతంలో 13 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి సుమారు 600 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశామన్నారు.
ఈ కాలనీలో ఇంకా మిగిలి ఉన్న భూమిని సుమారు 300 మందికి ఇవ్వొచ్చని, ఇంటి పట్టాలు పంపిణీ కి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు.
కీలగరం సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నారాయణవనం మండలం కీలగరం సచివాలయంను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యాలయంలోని హాజరు పట్టీ, రికార్డులను పరిశీలించి ఉద్యోగులకు ఎమ్మెల్యే దిశ నిర్దేశం చేశారు.
సచివాలయం పరిధిలో ఇళ్ళు లేని, ఇతర పథకాలకు నోచుకొని నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వం నుండి లబ్ది చేకూరే విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
