వాయులింగేశ్వర స్వామి అభిషేక సమయ కాలాలు మార్చవద్దు

అంజూరు తారక శ్రీనివాసులు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు
శ్రీకాళహస్తి వాయు లింగేశ్వరుడు దివ్య క్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పిలవబడే వాయులింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రఃతకాలము, మధ్య కాలము, ఉచ్చికాలము, ప్రదోషాకాలము అని “4” కాలాలు ఉంటాయి ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలోని నాలుగు కాలాలు అభిషేకాలు చేస్తారు అభిషేకము మూడో కాలమైన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేస్తారు వెంటనే హారతులు ఇవ్వడం జరుగుతుంది ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా జరిగే తంతు అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసమో భక్తుల సౌకర్యాలు అందిస్తున్నామనే మాట కాకుండా ఉన్న సాంప్రదాయాన్ని మార్చేడం ఒక్క కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో మాత్రమే అలాగా జరుగుతుంది అయితే ప్రఃతకాలంలో మాత్రమే సూర్యోదయ సమయం లో ఒక గుళిక కాలంలో అభిషేకం చేయాలి అయితే 6:00 గం కి సంకల్పం చేసిన తర్వాత అభిషేకం చేయడం జరుగుతుంది అయితే ఆ సమయాన్ని ఇప్పుడు 5:00గం కి మార్చాడం రెండవ కాలం 7:00గం కి జరగాల్సింది 6:00 కి మార్చాడం వంటి చిన్న చిన్న అంశాలను మార్చేటప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడికి ధూప దీప నైవేద్యాలు నోచుకోనుప్పటి నుండి కూడా దేవాలయంకి దీపం వెలిగించుకుంటూ ఉండే గురుకలు గార్లు అనేక కుటుంబాలు ఉన్నాయి అలాంటి వారిని గాని లేదా శాసనసభ్యులు వారుని గాని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అందరి ఆలోచనలు ఆచరణలో పెట్టి అభిషేక సమయాలు మార్చబాకండి మూడో కాలం అభిషేకం అయిన వెంటనే నైవేద్యం అనేది జరగాలి అలా కాకుండా ఒకటి రెండు గంటల తర్వాత నైవేద్యం పెడుతున్నారు అలా చేయడమే కాకుండా మేము చెప్పిందే చేయాలి అనేది మూర్ఖత్వపు ఆలోచన అలా చేయవచ్చా చేయకూడదా సాంప్రదాయం ఒప్పుకుంటుందా లేదా అనేది చిత్తశుద్ధితో ఆలోచించుకోవాలని మీడియా మిత్రుల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి మరియు నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారికి మరియు సభ్యులకి అధికారులకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దయచేసి పాత పద్ధతిని మార్చవద్దు మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం
అలాగే నేను గతంలో చెప్పినట్టు అభిషేకం టికెట్లు ఆన్లైన్ లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఏర్పాటు చేయాలి ఆన్లైన్లో ఎన్ని టికెట్లు అయితే ఇస్తున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు ఇవ్వాలి అభిషేకప్రియుడు వాయులింగేశ్వరుడు అటువంటి అభిషేకాన్ని భక్తులకి దూరం చేయవద్దు…. 🙏
