అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయండి.
మ్యాన్ హోల్స్ వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేయండి.
ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య.

దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయాలని, మ్యాన్ హోల్స్ ఉన్న బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో బుధవారం ఉదయం నగరంలో అండర్ బ్రిడ్జిలను, లోతట్టు ప్రాంతాలను కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతి రోజూ నీటి సాంధ్రత పరీక్షలు నిర్వహించి, క్లోరినేషన్ చేయాలని తెలిపారు. చిన్న కాలువల్లో వర్షపు నీటితో పాటు కొట్టుకొచ్చిన చెత్త, మట్టి తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తొలగించాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేయాలని, వచ్చిన పిర్యాదులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా 0877-2256766, 9000822909 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.లు మధు, మహేష్, తదితరులు ఉన్నారు.
