*కీలపూడి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే*

పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే కీలపూడి గ్రామ సచివాలయానికి చేరుకొని ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించారు.
అనంతరం కార్యాలయం లోని రికార్డులను పరిశీలించి ఉద్యోగులకు దశ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
