Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి

గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి

శెట్టిపల్లి కి సంబంధించి పట్టాలు త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలి

 

:రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖా మాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్

 

తిరుపతి, డిసెంబర్,02:

 

గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖా మాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ కోరారు.మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో విసి హాల్ నందు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశ కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మాట్లాడుతూ .. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 30.174 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకుఅదనంగా 270.23 చదరపు కిలోమీటర్ల కు విస్తరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ సంపూర్ణ తోడ్పాటును అందించాల్సి ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ శెట్టిపల్లి సమస్యను పరిష్కరించడం జరిగిందని ఇందుకు సంబంధించి నిర్ణీత గడువులోగా సంబంధిత లబ్ధిదారులకు పట్టాలను అందజేయాలన్నారు. జనవరి 2026 సంవత్సరంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను మరింత ఘనంగా నిర్వహించాలని సూచించారు. అందరికీ ఇల్లు కార్యక్రమానికి సంబంధించి భూ సేకరణ కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి సంబంధిత మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 22ఏలో ఉన్న భూములు ఎండోమెంట్ పరిధిలో లేకుంటే అలాంటి భూములు 22ఏ నుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయాల నిర్మాణానికి, కోట, వాకాడు, బాలాయపల్లి, వెంకటగిరి,ఒజిలీ ,పెల్లకూరు,సత్యవేడు,తొట్టంబేడు, నాగలాపురం, నారాయణవణం కార్యాలయాల మరమ్మతులకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు.

 

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ…. మొంతా తుఫాను సందర్భంగా జిల్లాలో తీసుకున్న తుఫాను నివారణ చర్యలలో భాగంగా 36 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, 627 కుటుంబాలకు156.75 క్వింటాళ్ల బియ్యాన్ని, మత్సకారులకు చెందిన 4098 కుటుంబాలకు 2049 క్వింటాళ్ల బియ్యాన్ని,2295 చేనేత కుటుంబాలకు1147.50 క్వింటాళ్ల బియ్యాన్ని అందించామన్నారు. తుఫాన్ సందర్భంగా 70 రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. నవంబర్ ఆరో తేదీన కెవిబి పురం మండలం, ఓలూరు రాయలచెరువు తెగిపోవడంతో పోలీసు, రెవెన్యూ ,ఇతర జిల్లా అధికారుల సమన్వయంతో సకాలంలో స్పందించి నివారణ చర్యలు చేపట్టామన్నారు.నాలుగైదు రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు.ఇందుకోసం 3.50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందించామన్నారు. శెట్టిపల్లి కి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఈనెల 22వ తేదీలోగా అన్ని పనులను పూర్తి చేసి పట్టాలను కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అలాగే గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోసం 10 లక్షల జనాభా ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఇందుకోసం తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట ,ఏర్పేడు, ఆర్ సి పురం లకు చెందిన 63 గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో కలిపేందుకు ప్రతిపాదించామని 13 గ్రామ పంచాయతీలు మాత్రమే ఆమోదం తెలిపారన్నారు. హతీ రాంజీ మఠం సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. జిల్లాలో అందరికీ ఇల్లు కార్యక్రమంలో గృహాలను మంజూరు చేసేందుకు భూసేకరణకు వెళ్లాల్సి వస్తుందన్నారు. స్వర్ణముఖి నది ,తొండవాడ ప్రాంతాలలోని ఆక్రమణలను తొలగించేందుకు సర్వే చేపడుతున్నామన్నారు. అలాగే స్వర్ణముఖి నది సుందరీ కరణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సూచించారన్నారు. సింహాచలం కండ్రిగ రిజర్ ఫారెస్ట్ ల్యాండ్ ఉందని, ఇంతకుముందు ఆ గ్రామస్తులకు డీకేటి పట్టా ఇచ్చారని, అయితే ఇటీవల కోర్టు వాటిని రద్దుచేసి ఇతర ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలని సూచించారన్నారు. ఇందుకోసం సుమారు 200 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని కలువాయి మండలాన్ని అలాగే నెల్లూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని సైదాపురం ,రాపూర్ మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ లో కలిపేందుకు గజట్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. 2026 జనవరి నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ను పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో సుమోటోగా కాస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 2,32,955 మందికి చేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పేడు- పూడి మధ్య బైపాస్ లైను, గూడూరు -రేణిగుంట మధ్య మూడవ లైను, తిరుపతి – కాట్పాడిమధ్య డబుల్ లైన్ ,అలాగే సదరన్ రైల్వే పరిధిలో అరక్కోణం- రేణిగుంట మధ్య మూడు మరియు నాలుగు లైన్లు, గుమ్మిడి పూండి- గూడూరు మధ్య మూడు, నాలుగు లైన్లు6666.35 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించనున్నారని వీటి భూసేకరణ కోసం నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని 2026 మార్చి 31 లోపు భూసేకరణను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 16 తాసిల్దార్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అలాగే జిల్లాలో విఐపి మరియు వివిఐపి కార్యక్రమాలకు చెల్లించాల్సిన 6.45 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరారు.

 

సమీక్షా సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా సమీక్షా కమిటీ మీటింగ్ గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ శాఖా మాత్యులు అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో అన్ని రకాల సమస్యలపై సమీక్షించడం జరిగిందన్నారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రతి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా అధికారులకు కూడా ప్రతి సమస్యను తగిన సమయంలో ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే నిజంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. మంత్రిగారు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు సూచించామన్నారు.

 

జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన సమావేశంలో దాదాపుగా 36 శాఖలపై అధ్యయనం చేయడం జరిగిందన్నారు. మునుపటి రివ్యూలో ఏమైనా పరిష్కారం కానీ సమస్యలు ఇంకా ఉంటే ఎలా చేస్తే బాగుంటుంది చర్చించుకొని ఒక కార్యచరణ రూపొందించుకొని వాటిని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఎప్పటినుంచో అంటున్నారని మున్సిపల్ కౌన్సిల్ లో కూడా అప్రూవల్ రావడం జరిగిందన్నారు. రాబోయే తరాలకు మంచి చేయాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామంగా భావించాలన్నారు. అలాగే ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు అయిన మొంతా తుఫాను, రాయల చెరువు సంఘటనలలో అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు అందరూ ఎక్కడ కూడా నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రాణ నష్టం లేకుండా చూడడం అభినందనీయమన్నారు. మరీ ముఖ్యంగా రాయల చెరువు కు గండిపడటంతో 9 అడుగుల నీళ్లు రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అని ఇలాంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సై కావచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఇంకా పిఎస్ఐ అందరూ కూడా స్పాంటేనియస్ గా స్పందించి సైరన్లు వేసి అందరిని కూడా సురక్షితంగా తరలించినందుకు వాళ్ళందరినీ కూడా అభినందించాలన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్లి ఎలాగైతే మంతా తుఫానులో అందరిని ఆదుకున్నారో రాయల చెరువు సంఘటనలో కూడా భాగమై అక్కడున్న వారిని రక్షించడం అభినందించదగ్గ విషయం అన్నారు. వారు రీ లొకేషన్ కోరుకుంటున్నారని కలెక్టర్ గారు తమ దృష్టికి తెచ్చారని అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండటానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్తి వెల్ది ఎన్విరాన్మెంట్ ఉండాలని ఎకో సిస్టం ఉండాలని ఉద్దేశంతో గత సంవత్సరం సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ చేపట్టడం జరిగిందన్నారు. ఇదే తరహా రాష్ట్రవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మరిన్ని కార్యక్రమాలు తిరుపతిలో చేపట్టాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారని అందులో భాగంగానే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నదులు చెరువులు సుందరీకరణ చేపట్టి వారు రెండు మూడు రోజులు పర్యటించడానికి వీలుగా వసతి సౌకర్యం కల్పించాలని ఆలోచన దృక్పథంలో ఉన్నారని అన్నారు. తిరుపతిలో రెవెన్యూ పరిశ్రమల ద్వారా 40 శాతం వస్తే పర్యాటకం ద్వారా 60% వస్తోందని 40% రెవెన్యూని బలపరుస్తూ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరచాల్సి ఉందని అన్నారు. రెవిన్యూ సమస్యలైన మఠం భూములు, దేవాలయ భూములు ఉన్నాయో వీటిపై రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు సమక్షంలో సమావేశాలు నిర్వహించి న్యాయపరమైన సలహాలను తీసుకుని ముందుకెళ్తామన్నారు. తిరుపతి జిల్లాలో అటవీ భూముల్లో బౌండరీస్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయని అక్కడ పేదవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారని పేదవాడి హక్కులు కూడా కాపాడే దిశలో తప్పకుండా ముందుకు వెళ్తామని తెలిపారు. మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సమస్య లో మేజర్ గా ఉన్నటువంటి సమస్య గంజాయి కాబట్టి ఎస్పీ గారు అద్భుతంగా ఈ సమస్యపై ఉక్కు పాదం మోపారని, ఎక్కడ కూడా యువత చెడుత్రోవ పట్టకూడదనే ఉద్దేశంతో గంజాయి తరలింపులపై దృష్టి పెట్టి అట్టివారిపై కఠినతరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రౌడీయిజం అనేది లేకుండా రౌడీయిజం ఉండకూడదు అనే లక్ష్యంతో పోలీసు వారు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు. హంద్రీనీవా నుంచి కళ్యాణి డాం కి ఎలాగైతే 126 కోట్ల రూపాయలతో దానిద్వారా రాబోయే రోజుల్లో చుట్టుపక్కల చెరువులు కూడా తద్వారా తిరుపతి చుట్టుపక్కల నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే ఎప్పటినుంచో ఉన్నటువంటి శెట్టిపల్లి సమస్య ను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం అయ్యే విధంగా కలెక్టరు మరియు కమిషనర్, తుడా చైర్మన్ గారు పక్క ప్రణాళికతో ముందుకు వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, అలాగే శెట్టిపల్లిని ఒక మోడల్ టౌన్షిప్ గా అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతి పట్టణవాసులు రైల్వే జోన్ కావాలని అడుగుతున్నారని దీనిపై ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సంవత్సరంలో మన రాష్ట్రానికి సుమారు 6000 కోట్లతో ఘనమైనటువంటి రైల్వే ప్రాజెక్టు రావడం చాలా హర్షినీయమన్నారు. రైతులు కూడా ఎక్కడా బాధపడకుండా యూరియా కూడా సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక రైతుకి ఎకరాకు మూడు బస్తాలు అందేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. గూడూరు నియోజకవర్గం నెల్లూరులో కలపాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు కోరారని భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల రీత్యా గూడూరుని తిరుపతిలో కలపడానికి కారణాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి దిశగా ఉంది కనుక రానున్న రోజుల్లో తిరుపతి మరింత అభివృద్ధి చెందడానికి ఇది కీలకం కానుందని అన్నారు. ఐదు మండలాలకు సంబంధించి గూడూరుకు నేషనల్ కనెక్టివిటీ ఉన్నదని అన్నారు. దీనిపై ఇంకా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చని అది గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్. ఎల్. సిలు బల్లి కల్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రహ్మణ్యం, చంద్రగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు పులిపర్తి నాని అరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహా యాదవ్, డి సి సి చైర్మన్ రాజశేఖరరెడ్డి, వన్నియకుల క్షత్రియ కోఆపటివ్ చైర్మన్ రాజన్, డిసి ఎమ్ సి చైర్మన్ నాగేశ్వరావు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి రావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ బొమ్మన, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు మునిసిపల్ కమీషనర్ ఎన్ మౌర్య, ట్రైని కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి బాబా, జిల్లా రెవెన్యూ అధికారి జి నర్సింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట,ఆర్టీవోలు రామ్మోహన్, బానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజమాండ్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి, డీపీ ఓ సుశీలా దేవి, డ్వామా పిడి శ్రీనివాసరావు, సి పి ఓ వెంకటేష్, డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, డి ఈ ఓ, కుమార్, ప్రసాద్ రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి, ఎల్. శివకుమార్, ఎక్సైజ్ నాగమల్లేశ్వర రావు, ల్యాండ్ అండ్ సర్వే శాఖ అధికారి, అరుణ్ కుమార్, ఆర్ టి ఓ మురళి మోహన్, ఆర్ అండ్ బి ఎస్ ఇ రాజా నాయక్ విద్యుత్ శాఖ, సివిల్ సప్లై, డి ఎల్ డి ఓ, సంక్షేమ శాఖ అధికారులు, మునిసిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, గృహనిర్మాణ శాఖ, పశు సంవర్ధక శాఖ, రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారి, వ్యవసాయశాఖ అధికారి, టూరిజం, జిల్లా అధికారులు. తదితరులు పాల్గొన్నారు.

 

——-డి ఐ పి ఆర్ ఓ తిరుపతి ——

Related posts

తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

Garuda Telugu News

వేద పారాయణదార్ పోస్టులపై వైసీపీ నేతల సిగ్గుమాలిన గగ్గోలు

Garuda Telugu News

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

Leave a Comment