Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

*గుంటూరు జిల్లా పోలీస్…*

*ది.02.12.2025*.

 

గుంటూరు జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు

📍గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి విశేష కృషి చేస్తున్నారు.

 

🫟 *గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 75 రోజుల్లోనే గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న 163 మంది వ్యక్తులను గుర్తించి, వారిపై 28 కేసులు నమోదు చేయించి, వారిలో 127 మందిని అరెస్ట్ చేయించడం జరిగింది.(మిగిలిన 36 మందిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.)*

 

🫟 *నమోదైన 28 కేసుల్లో సుమారు 48 కేజీల ఘన రూప గంజాయిని, 139 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 28 గ్రాముల MDMA అనే మత్తు పదార్థాన్ని సీజ్ చేయించడం జరిగింది.వీటితో పాటు 03 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయించారు.*

 

🫟 గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి *”టాస్క్ ఫోర్స్”* బృందాన్ని ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, గంజాయి కేసుల్లో ఉన్న పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టి, విస్తృత తనిఖీలు చేయిస్తూ ఎక్కడిక్కడ గంజాయి కార్యకలాపాలను అరికడుతూ వస్తున్నారు.

 

🫟 అదే విధంగా *”సంకల్పం – మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం”* అనే కార్యక్రమాన్ని AP VIT యూనివర్సిటీ నందు ప్రారంభించారు.*”అవగాహనతో అంతు చూద్దాం”* అనే ఆలోచనతో ఈ సంకల్పం కార్యక్రమం ద్వారా విద్యాసంస్థలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాల గురించి విదార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

 

🫟 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే *”ధృఢ సంకల్పం”* గా గంజాయి కార్యకలాపాల తావు లేకుండా చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ గస్తీ నిర్వహించే విధంగా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

🫟అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాల్లో, పాడుబడిన భవనాలు, గుబురు పొదలు, రాత్రి సమయాల్లో జనారణ్యం లేని ప్రాంతాలలో ముమ్మర గస్తీ ఏర్పాటు చేసి, పటిష్ట నిఘా పెట్టి ఎటువంటి అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని సూచిస్తున్నారు.

 

🫟 గౌరవ ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, విక్రయం మరియు సరఫరా వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని, పోలీస్ అధికారులు వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.పట్టుబడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి గంజాయి అందిస్తున్న వారు గాని, వీరు ఎవరికైనా గంజాయి సరఫరా చేస్తున్నా గానీ, వారి వివరాలు సేకరించి వారిపై కూడా తప్పనిసరిగా కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

 

🫟 గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలైతే తప్పకుండా పోలీస్ వారి సహాయం తీసుకుని, ఆ వ్యసనం నుండి బయటకు రావచ్చని సూచిస్తున్నారు.అదే విధంగా మీ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ వారికి గానీ, డయల్ 112 నెంబర్ కి గాని, 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి గాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

🫟 *మాదక ద్రవ్యాల భారిన పడకుండా భావితరాల భవిష్యత్తును కాపాడాలనే బృహత్ ప్రణాళికతో* తమ జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సహకారంతో ముందుకు వెళుతున్నామని, దీనికి జిల్లా ప్రజల సహకారం కూడా అవసరమని అభిప్రాయపడ్డారు.

Related posts

సత్యవేడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో పత్తాలేని పోషణ్ పక్వాడ కార్యక్రమం

Garuda Telugu News

దేశంలో ఏ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా తొలిగా గుర్తుకొచ్చే ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే

Garuda Telugu News

వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యదర్శిగా ..*పాడి లాల్ బాబుయాదవ్*

Garuda Telugu News

Leave a Comment