*తిరుపతి ఐఐటీ కాలేజ్ 8 వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ – 2025 లో పాల్గొన్న మంత్రి నారాయణ.*

తిరుపతి (ఏర్పేడు) ఐఐటీ కాలేజ్ లో సోమవారం ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ వారు నిర్వహించిన 8 వ సదస్సు(ILCE) – 2025 లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ముఖ్య అతిధి గా పాల్గొన్న మంత్రికి ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ, లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు, ప్రొఫెసర్లు ఘనస్వాగతం పలికారు. ఐఐటీ లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి నారాయణ పరిశీలించగా, అయా విభాగాధిపతులు టెక్నాలజీ వినియోగంపై మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ లీన్ కన్స్ట్రక్షన్ వారు నిర్వహించిన సదస్సులో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిర్మాణ రంగంలో వృధా, సమయాన్ని తగ్గించటంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్ బాగా పని చేస్తోందని తెలిపారు. లీన్ కన్స్ట్రక్షన్ పని విధానంతో నిర్మాణరంగ ప్రాజెక్టులు సకాలంలో, మంచి నాణ్యతతో పూర్తవుతాయని తెలిపారు. మునిసిపల్ మరియు పట్టణ అభివృద్ధిలో ఈ పని విధానం చాలా సందర్భోచితంగా ఉపకరిస్తుందని తెలిపారు. మున్సిపాల్టీల్లో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఐ.ఎల్.సి.ఈ. ప్రయత్నాలను అభినందిస్తున్నానని అన్నారు. మున్సిపాలిటీల్లో మొదటగా ఒక చోట ఫైలెట్ ప్రాజెక్ట్ చేపడతామని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే సెమినార్ కు హాజరైన అందరూ పలు అంశాలపై చర్చించి ఉపయోగకరమైన ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.
