స్థానిక ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చర్యలు తీసుకోవాలి- సిపిఎం

సురుటుపల్లి దేవస్థానం ఈవో సత్యవేడు ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి దాసరి జనార్ధన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సత్యవేడు శాసనసభ్యులైన కోనేటి ఆదిమూలం ఎన్నికల్లో గెలిచినప్పటికీ సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ఈవో రాజకీయ కారణాలతో ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని విమర్శించారు. స్థానిక శాసనసభ్యులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు బాధ్యతలను అధికారులు గౌరవించాలని సూచించారు సత్యవేడు నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్న వర్గ పోరాటాలలో అధికారులు ఒక వర్గానికి కొమ్ముగాస్తు ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేను అవమానించడం దారుణం అన్నారు . జనరల్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిణామాలు జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అధికారులకు బాగాతెలిసని. జనార్ధన్ తెలిపారు. దేవస్థానం అధికారి ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా స్థాయిలో అధికారులుజోక్యం చేసుకొని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డిమాండ్
