స్థానిక దళిత ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి- బీఎస్పీ

*సురుటుపల్లి దేవస్థానం ఈవో సత్యవేడు ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జీ మరియు, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జీ జై భీమ్ ధన గారు డిమాండ్ చేశారు*.
సత్యవేడు *శాసనసభ్యులైన కోనేటి ఆదిమూలం* ఎన్నికల్లో గెలిచినప్పటికీ సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ఈవో రాజకీయ కారణాలతో ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని విమర్శించారు. దేవస్థానం అధికారి ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా స్థాయిలో అధికారులుజోక్యం చేసుకొని ఆమెపై చట్టపరమైన చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని, డిమాండ్ చేశారు.
