*జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం*

తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
తిరుపతి డీఆర్సీ సమావేశానికి విచ్చేసిన మంత్రిని ఎమ్మెల్యే ఆదిమూలం కలుసుకొని శాలువ కప్పి, ఘనంగా సత్కరించారు.
అనంతరం రోడ్లు మరియు భవనాలు శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఎమ్మెల్యే ఆదిమూలం కలుసుకొని నియోజకవర్గంలో రోడ్లు దుస్థితిని వివరించి బాగు చేయాలని కోరారు.
తన వినతులకు ఈఈ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడించారు.
