*ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్*

✍️ *మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనకు ప్రతిరూపం ఈ ప్రజా దర్బార్*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *నారాయణవనం లో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కు విశేష స్పందన*
ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ పరిష్కరించడానికే యువనేత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం నారాయణవనం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ నేతృత్వంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రజలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి యువ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పేరిట ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పెద్ద పీట వేశారన్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు ద్వారా నిర్వహించి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే ఆయుధంలా మారిందన్నారు.
ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు ఘనత మంత్రి శ్రీ నారా లోకేష్ గారికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆదిమూలం కొనియాడారు.
అనంతరం ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే కు అందించారు.
అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఆదిమూలం చిన్న సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా తక్షణ పరిష్కార మార్గం చూపగా.. పెద్ద సమస్యలను జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి వారం లోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, అందులో భాగంగానే భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు అందించడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, మండలానికి చెందిన ప్రజలు, అన్నీ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
