*సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పని చేస్తా..*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం*
✍️ *సత్యవేడు మండలం జడేరి లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ*
సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పని చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
గురువారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు మండలం జడేరి కి చేరుకొని నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల వెంటబడి అభివృద్ధి పనులు చేయిస్తానని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన వివరించారు.
ఎన్టీఆర్ గృహ కల్ప పథకం ద్వారా లబ్ధిదారులకు పక్కా ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు.
అలాగే నిన్న అనగా మంగళవారం నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.7 వేలు నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, రైతులు చెక్ చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
