*ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి*

✍️ *ఉద్యోగులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలి*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *వెస్ట్ వరత్తూరు లో ఉపాధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ*
✍️ *స్ధానిక గ్రామ సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే*
గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు.
సోమవారం బుచ్చి నాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు లో ఉపాధి హామీ పనులకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం కు ఉపాధి హామీ కూలీలు గజ మాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఉపాధి పని ప్రదేశంలో సిబ్బంది మార్కింగ్ ఇచ్చి కూలీలకు గరిష్ఠ కూలీ వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.
తమకు గత మూడు నెలలుగా కూలీ డబ్బులు పెండింగ్ లో ఉందని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డబ్బులు ఇప్పించాలని కూలీలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆదిమూలం తప్పక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కూలీలకు హామీ ఇచ్చారు.
అనంతరం వెస్ట్ వరత్తూరు గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్యాలయంలో హాజరు పట్టి, రికార్డులను పరిశీలించి, ఉద్యోగులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
