పాకాల. తిరుపతి జిల్లా,
కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి…..

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయితీ కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మృతదేహం చెరువులో నీటి పై తేలుతుండగా స్థానికులు గుర్తించి, పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
